Vikram Misri: భారత్ శాంతికి కట్టుబడి ఉంది.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

by B.Srinivas |

భారత్ శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ తనపై జరిగే ఉగ్రదాడులను మాత్రం సహించబోదని విదేశాంగ కార్యర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.

Vikram Misri: భారత్ శాంతికి కట్టుబడి ఉంది.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ తనపై జరిగే ఉగ్రదాడులను మాత్రం సహించబోదని విదేశాంగ కార్యర్శి విక్రమ్ మిస్రీ (Vikram misri) స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు దీటుగా స్పందిస్తామని, వాటికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య బృందాలు విదేశాలకు బయలు దేరనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేడీయూ ఎంపీ సంజయ్ ఝా (Sanjay Jha) , శివసేన ఎంపీ శ్రీకాంత్(Srikanth), డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimoli) నేతృత్వంలోని 3 ప్రతినిధుల బృందాలతో మిస్రీ మంగళవారం భేటీ అయ్యారు.

ఉగ్రదాడుల్లో పాక్ పాత్ర, ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పరిణామాలపై వారికి వివరించారు. అనంతరం మిస్రీ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌ను నమ్మడం అంటే తాను చేసిన నేరాన్ని దర్యాప్తు చేయడానికి దొంగకు అనుమతిచ్చినట్టేనని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ కింద భారత చర్య పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపైనే లక్ష్యంగా పెట్టుకుందని, సైనిక స్థావరాలు, పౌరులపై కాదని తెలిపారు. భారత సైనిక స్థావరాలు, పౌర జనాభాపై దాడి చేయడానికి పాక్ ప్రయత్నించిన తర్వాతే భారత్ దాడి చేసిందని సభ్యులకు వివరించారు.

Next Story