- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో సెన్సెషన్‍గా మారింది. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే స్థాయికి ఎదగడం వెనుక పక్క ప్రణాళిక ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన నటించిన 'GOAT' (గోట్) సినిమాలోని ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఈ చిత్రంలో విజయ్ ఉపయోగించిన కారు నంబర్ ప్లేట్ పై 'TN 07 CM 2026' అని ఉంది. ఇందులో సీఎం 2026 అని ఉండటంతో విజయ్ తన రాజకీయ భవిష్యత్తును ముందుగానే ఊహించిందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నంబర్ ప్లేట్ అంశంపై చిత్ర దర్శకుడు స్పందించారు.
మన సీఎం పక్కన ఉన్నది నేనే:
గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు, యాక్టర్ ప్రేమ్ జీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కారు నంబర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రేమ్ జీ .."కారులో మన సీఎం పక్కన కూర్చున్నది నేనే" అంటూ సరదాగా పోస్ట్ చేశారు. అలాగే వెంకట్ ప్రభును ట్యాగ్ చేస్తూ, ఆయన ఈ విషయాన్ని అప్పుడే ఊహించారని ప్రేమ్ జీ పేర్కొన్నారు. దీనికి స్పందనగా వెంకట్ ప్రభు నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. కాగా ‘తిరిగెళ్లే ఐడియానే లేదు.. ఐయామ్ కమింగ్’ - తన పొలిటికల్ కెరీర్‌పై హింట్ ఇస్తూ ‘జననాయగన్’ మూవీలో విజయ్ చెప్పినట్లుగానే ఈ దళపతి.. ఎంట్రీతోనే ప్రజలతో ‘విజిల్’ వేయించడం వెనుక విజయ్ వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయని అతని ఫ్యాన్స్,రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






