విజయ్ రూపానీ లండన్ ప్రయాణం ఆమె కోసమేనా.. కానీ అంతలోనే విషాదం!

by velandi.Saikiran |

గుజరాత్ లోని ( Gujarat) అహ్మదాబాద్ విమానాశ్రయం (Ahmedabad Airport) దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో.. మాజీ ముఖ్యమంత్రి

విజయ్ రూపానీ లండన్ ప్రయాణం ఆమె కోసమేనా.. కానీ అంతలోనే విషాదం!
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని ( Gujarat) అహ్మదాబాద్ విమానాశ్రయం (Ahmedabad Airport) దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో.. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) మృతి చెందిన సంగతి తెలిసిందే. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో... అందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు.. మృతి చెందారు. ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా మరణించే ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవాళ రాత్రి లోపు లేదా ఉదయం వరకు దీనిపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. జనాలు ఉంటున్న ఇండ్లపై... విమానం దూసుకు రావడంతో ప్రమాదం ఎక్కువ జరిగే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మొదట ఆయన ఈ విమానంలో లేరని జోరుగా ప్రచారం చేశారు.

కానీ ఆ తర్వాత ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఆయన లండన్ కు ( London) ఎందుకు వెళ్తున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన భార్య ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా అక్కడే ఆమె ఉంటున్నారట. అయితే ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి... లండన్ ప్రయాణమయ్యారు విజయ్ రూపానీ. కానీ ఇంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story