- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ట్విస్ట్.. మళ్లీ షాకిచ్చిన గవర్నర్: లోక్‌భవన్ నుంచి తిరిగొచ్చిన విజయ్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ విషయంలో చుక్కెదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ విషయంలో చుక్కెదురైంది. విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వంటి కీలక పార్టీల మద్దతు లభించిన తర్వాత, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరేందుకు విజయ్ లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో విజయ్ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రస్తుతం కేరళ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తుండటంతో, అత్యవసర పనిపై ఆయన కేరళకు వెళ్లినట్లు సమాచారం. దీంతో గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో విజయ్ లోక్‌భవన్ గేటు నుండే వెనుదిరిగారు.
టీవీకే ఆఫీస్‌లో ఉత్కంఠ..
ప్రస్తుతం విజయ్ పనైయూర్‌లోని టీవీకే కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. గవర్నర్ తిరిగి ఎప్పుడు వస్తారు? అపాయింట్‌మెంట్ ఎప్పుడు లభిస్తుంది? అనే అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. గవర్నర్ కార్యాలయం నుండి పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. వాస్తవానికి ఈరోజే గవర్నర్‌ను కలిసి, రాత్రికి లేదా రేపు ఉదయం కల్లా ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ భావించారు. కానీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ మరికొన్ని గంటలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామంతో అటు విజయ్ అభిమానులు, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడబోమని ప్రకటించడంతో తమిళనాడులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.






