- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లండన్ వెళ్తున్నానని జైట్లీకి చెప్పాను... విజయ్ మాల్యా సంచలనం !
ఇండియాలో ఉన్న బ్యాంకులను దోచేసిన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాను వదిలి లండన్

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో ఉన్న బ్యాంకులను దోచేసిన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాను వదిలి లండన్ కు వెళ్లే సమయంలో.. అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చి వచ్చేసినట్లు తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను పార్లమెంట్ లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి... ఇలా లండన్ వెళ్తున్నానని చెప్పి, అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లినట్లు స్పష్టం చేశారు విజయ్ మాల్యా.
అయితే ఈ వార్త బయటకు వచ్చాక ఆయన నన్ను అసలు కలవలేదని బుకాయించారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మేము కలుసుకోవడం చూసాను అనడంతో... ఆయన మాట మార్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి మాట మార్చి ఏదో రెండు నిమిషాల పాటు మాట్లాడి... వెళ్లానని చెప్పినట్లు స్పష్టం చేశారు విజయ్ మాల్యా. కానీ అరుణ్ జైట్లీ కి మాత్రం చెప్పి.. లండన్ కు వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా.... 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడంతో... ముసుగులో ఉన్న విజయ్ మాల్యా బయటకు వచ్చారు. లండన్ వేదికగానే RCB విజయోత్సవాలను జరుపుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు విజయ్ మాల్యా. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడం.. తనకు ఆనందంగా ఉందని.. ప్లేయర్ లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.






