- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15ఏళ్ల క్రితమే రాహుల్‌తో భేటీ.. కీలక పదవితో గాలం.. కానీ విజయ్ ఏం చెప్పాడంటే?
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు విజయ్ జోసెఫ్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకే కూటమి నుండి బయటకు వచ్చి మరీ కాంగ్రెస్ టీవీకేకు సపోర్ట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు విజయ్ జోసెఫ్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకే కూటమి నుండి బయటకు వచ్చి మరీ కాంగ్రెస్ టీవీకేకు సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో 2009 ఆగస్టులో విజయ్ రాహుల్ గాంధీతో భేటీ అయిన ఫోటోలు షేర్ చేస్తూ అప్పుడే ఈ బంధానికి ముడిపడిందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుదుచ్చేరిలో జరిగిన విజయ్ మక్కల్ ఇయక్కం సమావేశంలో తన రాజకీయ ఆశయాల గురించి సూచనప్రాయంగా చెప్పిన మరుసటి రోజే విజయ్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలవడంతో అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. విజయ్ కాంగ్రెస్ లో చేరతారని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అతడికి0 అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు విజయ్ కి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి అప్పుడే బీజం కూడా పడిందని అంటున్నారు.
అయితే నిజానికి యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం, కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు జోరుగా వినిపించడంతో ఆ సమయంలోనే విజయ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాను కేవలం సినిమాల్లో నటించడంపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీతో సమావేశం కేవలం మర్యాదపూర్వకమైనదని తెలిపారు. రాజకీయాల గురించి కానీ ఏ రాజకీయ పార్టీలో చేరడం గురించి గానీ ఆయనతో చర్చించలేదని చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలు కూడా లేవన్నారు. రాజకీయాల విషయంలో నిర్ణయం తీసుకునే స్థితిలో లేనని, సినిమాలకే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక అప్పుడు అలా చెప్పిన విజయ్ ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు సీఎం అయ్యారు.






