విజయ్ ఓటమి.. అభిమాని ఆత్మహత్యాయత్నం

by Naga Rani Yarlagadda |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు విజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

విజయ్ ఓటమి.. అభిమాని ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు విజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీవీకే అధినేత అయిన విజయ్ కు.. నటుడిగా కొన్ని లక్షల మంది అభిమానులున్నారు. అయితే.. విజయ్ ఓడిపోతారన్న వదంతులు రావడంతో ఓ వీరాభిమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన అభిమాన నటుడు ఓటమి పాలవుతాడన్న మాటలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరికి చెందిన కె. మహేంద్రన్ (28) విజయ్ కు, టీవీకే పార్టీకి హార్ట్ కోర్ ఫ్యాన్. ఆయన ఎన్నికల్లో ఓడిపోనున్నారని ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు రూమర్లు రాగా.. మనస్తాపానికి గురై గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు మహేంద్రన్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో మహేంద్రన్ కు చికిత్స జరుగుతున్నట్ల కృష్ణగిర టౌన్ పీఎస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story