Annamalai : విజయ్ బ్రో..మీ మాటలు సరికాదు : అన్నామలై ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు..నటుడు విజయ్(Vijay) పార్టీ తొలి వార్షికోత్సవ వేడుకలలో జాతీయ విద్యావిధానం (NEP)..త్రిభాష విధానానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తమిళనాడు చీఫ్(BJP Chief) అన్నామలై(Annamalai) మండిపడ్డారు.

Annamalai : విజయ్ బ్రో..మీ మాటలు సరికాదు : అన్నామలై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు..నటుడు విజయ్(Vijay) పార్టీ తొలి వార్షికోత్సవ వేడుకలలో జాతీయ విద్యావిధానం (NEP)..త్రిభాష విధానానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తమిళనాడు చీఫ్(BJP Chief) అన్నామలై(Annamalai) మండిపడ్డారు. విజయ్ బ్రో మీ మాటలు సరికావని.. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని.. నువ్వు బోధించేది, ఆచరించు బ్రో.. నువ్వు ఎందుకు అబద్ధాలు చెబుతున్నావంటూ ప్రశ్నించారు.

మీరు నడుపుతున్న విజయ్ విద్యాశ్రమ పాఠశాలలో మూడు భాషలు ఉన్నాయని.. కానీ మీ పార్టీ కార్యకర్తల పిల్లలు మాత్రం రెండు భాషల్లో చదువుకోవాలా..?" అంటూ విజయ్ ని అన్నామలై నిలదీశారు. కోయంబత్తూర్ లో జరిగిన ఒక సభలో అన్నామలై మాట్లాడుతూ విజయ్ వైఖరిపై మండిపడ్డారు.

అంతకుముందు పార్టీ వార్షికోత్సవ సభలో విజయ్ మాట్లాడుతూ "నూతన విద్యావిధానం, త్రిభాష సూత్రం అమలుపై బీజేపీ, డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతోందని..ఈ సమస్యను రంగస్థలంగా మార్చారని..రెండూ పెద్ద పార్టీలు సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. వారి వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉంది" అని ఎద్దేవా చేశారు. డీఎంకే వ్యతిరేకిస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్ కూడా వ్యతిరేకించారు.

ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్ల నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై విజయ్ స్పందించారు. కేంద్రం తీరును తప్పుపట్టారు.

బీజేపీ, డీఎంకే నిజాయతీ లేని పార్టీలని దుయ్యబట్టారు. వారిని అధికారం నుంచి దించేయడమే మేలని.. 'గెటౌట్' హ్యాష్ ట్యాగ్ పెట్టి వారిని సాగనంపడమే లక్ష్యంగా కలసికట్టుగా కృషి చేద్దామంటూ విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story