ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రులకు శాఖలను కేటాయించిన విజయ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-10 04:10:52  IST  )

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రులకు శాఖలను కేటాయించిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రమాణ స్వీకారానికి ముందే తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించి విజయ్ తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతుండగా, అందులో ఏడుగురికి కీలక శాఖలను అప్పగించారు. ముఖ్యమంత్రిగా విజయ్ అత్యంత కీలకమైన హోం, ప్రజాపాలన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కీర్తన, టీకే ప్రభులకు శాఖల కేటాయింపుపై సీఎం విజయ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వీరికి బాధ్యతలు అప్పగించనున్నారు.

శాఖల కేటాయింపు..

సీఎం విజయ్‌ – హోం, ప్రజాపాలన శాఖలు.

ఆధవ అర్జున్‌ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ.

సెంగొట్టాయన్‌ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD).

వెంకట్రామన్‌ – పాఠశాల విద్యాశాఖ.

ఎన్‌. ఆనంద్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌.

నిర్మల్ కుమార్‌ – విద్యుత్ శాఖ.

రాజమోహన్‌ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ.

అరుణ్ రాజ్‌ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ.

కీర్తన, టీకే ప్రభు‌లకు ఇంకా శాఖలు కేటాయించని విజయ్‌.

Next Story