- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధ్యాత్మిక యాత్రలో ‘అశ్లీల’ పారవశ్యం.. న్యూడ్ డ్యాన్స్‌లతో రెచ్చిపోయిన భక్తులు..(వీడియో)
కన్వర్ యాత్ర అనేది హిందూ యాత్రికులు శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) గంగా నీటిని శివ ఆలయాలకు సమర్పించడానికి చేసే పవిత్ర సంప్రదాయం. అయితే ఈ ఏడాది కన్వర్ యాత్రలో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు

దిశ, వెబ్ డెస్క్ : కన్వర్ యాత్ర అనేది హిందూ యాత్రికులు శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) గంగా నీటిని శివ ఆలయాలకు సమర్పించడానికి చేసే పవిత్ర సంప్రదాయం. అయితే ఈ ఏడాది కన్వర్ యాత్రలో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలో అశ్లీల డ్యాన్స్‌లు వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా, అయోధ్య నుంచి వస్తున్న కన్వరియన్లు ఉన్న ఒక ట్రక్‌పై ఇద్దరు మహిళలు డీజే సాంగ్స్‌కు న్యూడ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఈ అశ్లీల ప్రదర్శన కొందరు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇది యాత్ర పవిత్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పాటలు పాడే గాయని అనురాధా పౌడ్వాల్ వంటి ప్రముఖులు ఈ ప్రదర్శనను ఖండించారు. ఇటువంటి అర్థంలేని చర్యలను ఆపాలని కోరారు. యాత్ర యొక్క ఆధ్యాత్మిక సమగ్రతను కాపాడేందుకు కఠిన నియమాలు అవసరమని పిలుపునిచ్చారు.






