Attack: మోకాళ్లపై కూర్చోబెట్టి.. హమాస్ తరహాలో కాల్పులు.. పహల్గాం ఉగ్రవాదుల దాడి వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-04-28 11:34:57  IST  )

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 26 మందిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

Attack: మోకాళ్లపై కూర్చోబెట్టి.. హమాస్ తరహాలో కాల్పులు.. పహల్గాం ఉగ్రవాదుల దాడి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam Terror Attack) ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 26 మందిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో కొంత మంది గుట్టలపైకి ఎక్కి వీడియోలు తీయడంతో దాడి వీడియోలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. వీడియోలో చూపిస్తున్న ప్రకారం.. ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. దీంతో కాల్పుల శబ్దాలు విని టూరిస్టులు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే టూరిస్టులను మోకాళ్లపై కూర్చోబెట్టి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం టూరిస్టులు చిత్రీకరించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పాలస్తీనా ఇస్లామిక్ సంస్థ అయిన (Hamas) హమాస్, ఇజ్రాయెల్ దాడిని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అదే తరహాలో పర్యటకులపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడినట్లు కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, బీహార్‌లో గురువారం ప్రధాని మోడీ ఈ ఘటనపై స్పందించారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు.. భారత ఆత్మపైనే దాడికి దుస్సాహసం చేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఉగ్రదాడిలో అమయాకులు చనిపోయారని, మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపండని ప్రజలకు పిలుపునిచ్చారు. పహల్గాం ఘటనతో దేశమంతా దు:ఖంలో మునిగి పోయిందన్నారు. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను, వారికి సహకరించిన వారిని వదిలిపెట్టమని, వారిని కఠినంగా శిక్షిస్తామని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం ఆసన్నమైందని, ఉగ్ర దాడికి పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

Next Story