- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులు లేకున్నా చెరగని చిరునవ్వు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి వీడియో!
రెండు చేతులు లేవనే బాధ ఆ పసిపాప ముఖంలో అస్సలు లేదు. తన తోటి స్నేహితులు ఉత్సాహంగా ఆడుకుంటుంటే.. తాను వారితో కలిసి ఆడలేకపోతున్నానన్న దిగులు లేకుండా, వారి ఆనందాన్ని చూసి ఆ చిన్నారి మురిసిపోయిన తీరు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు చేతులు లేవనే బాధ ఆ పసిపాప ముఖంలో అస్సలు లేదు. తన తోటి స్నేహితులు ఉత్సాహంగా ఆడుకుంటుంటే.. తాను వారితో కలిసి ఆడలేకపోతున్నానన్న దిగులు లేకుండా, వారి ఆనందాన్ని చూసి ఆ చిన్నారి మురిసిపోయిన తీరు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. దివా చౌదరీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటుండగా, చేతులు లేని ఓ చిన్నారి పక్కనే కూర్చొని వారిని చూస్తూ స్వచ్ఛమైన నవ్వులు చిందించడం ఈ వీడియోలో చూడొచ్చు. కాగా, దివా చౌదరీ అనే deeva_2024 ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారి వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఖాతా నుంచి తాజాగా మరో వీడియో విడుదల చేశారు. అందులో చిన్నారికి చేతులు ఉన్నప్పుడు గతంలో తీసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను సైతం చూసిన నెటిజన్‌లు తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు.
చిన్నారి చిరునవ్వుకు నెటిజన్‌లు ఫిదా
శారీరక వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, లేనిదాని గురించి బాధపడకుండా ఉన్నదానితో సంతోషంగా గడపాలని ఆ పాప తన చిరునవ్వు ద్వారా చాటిచెప్పిందని నెటిజన్‌లు స్పదిస్తున్నారు. స్నేహం అంటే కలిసి ఆడుకోవడమే కాదు, ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం అని నిరూపించింది. నెటిజన్లు ఆ చిన్నారి చిరునవ్వుకు ముగ్ధులవుతూ.. ‘నీ నవ్వులో ఎంత శక్తి ఉందో తల్లీ’ అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






