J&K: ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి మృతి.. పోలీసుల నుంచి పారిపోయే యత్నంలో ఘటన

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.

J&K: ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి మృతి.. పోలీసుల నుంచి పారిపోయే యత్నంలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. కుల్గాంలో జిల్లాలో ఈ ఘటన జరగగా.. పోలీసులు అతడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి పారిపోయే క్రమంలో సదరు వ్యక్తి నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతడి మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు 23 ఏళ్ల ఇంతియాజ్‌ అహ్మద్‌ (Imitiaz Ahmad) సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. కుల్గాంలోని టాంగ్‌మార్గ్‌ (Tangmarg)లో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు ఉగ్రవాదుల ఉన్న ప్రాంతాన్ని చూపిస్తానంటూ పోలీసులను నమ్మించాడు. దీంతో పోలీసులు, ఆర్మీ బలగాలు ఆదివారం ఉదయం ఇంతియాజ్‌ను తీసుకొని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఇంతియాజ్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేషా నదిలోకి దూకేశాడు. అయితే, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయాడు. పోలీసులే అతడ్ని చంపేశారని ఇంతియాజ్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే అతడిని చంపేశారంటూ ఆరోపించారు (custodial death).

మెహబూబా ముఫ్తీ ఆరోపణలు..

మరోవైపు, జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ సైతం ఈ ఘటనపై ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని అన్నారు. ఇంతియాజ్‌ మృతిలో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకినట్లు ఓ వీడియో ద్వారా తేలింది. ఎవరి ప్రమేయం లేకుండా ఇంతియాజ్‌ నదిలోకి దూకుతున్నట్లు ఉన్న వీడియో బయటకు రావడంతో ఈ ఘటనలో పోలీసుల ప్రమేయం లేదని తేలింది.

Next Story