ఉప రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటింగ్‌ ఏజెంట్లుగా ఆ ముగ్గురు కేంద్ర మంత్రులు

by Kema Shiva Kumar |

జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానాన్ని (Vice President Election) భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

ఉప రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటింగ్‌ ఏజెంట్లుగా ఆ ముగ్గురు కేంద్ర మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానాన్ని (Vice President Election) భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పోటీలో ఎన్డీఏ నుంచి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan), ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి (B Sudarshan Reddy) బరిలో నిలిచారు. అయితే, సెప్టెంబర్‌ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ ఏజెంట్లుగా ముగ్గురు కేంద్ర మంత్రులు నియమితులయ్యారు. అందులో రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు, శ్రీకాంత్ శిండే ఉన్నారు.

కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోర్‌ల సంఖ్య 781గా ఉంది. అందులో లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉండనుంది. కానీ, అభ్యర్థి ఎవరైనా సరే 391 ఓట్ల మేజిక్ ఫిగర్ దాటాల్సిందే. అధికార ఎన్డీయే (NDA) కూటమికి ఇప్పటివరకు 422 సభ్యుల బలముంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇండియా కూటమికి 311 మంది బలం ఉండగా.. అందులో ఇతరులు 45 మంది ఉన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే క్రాస్ ఓటింగ్ జరిగి ఆయన ఎన్డీఏ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story