- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vice-President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ జాబితా రెడీ
ఎలక్టోరల్ కాలేజీ జాబితాను ఖరారు చేసినట్లు ఈసీ వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికల (Election of Vice President) ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోర్ జాబితా (Electoral collge) సిద్ధం అయినట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఈసీ (EC) ఓ ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66(1) ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులు, లోక్ సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. దీని ప్రకారం ఉప రాష్ట్రపతి -2025 ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఆధారంగా అక్షరక్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం అసిస్టెండ్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సిగ్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటర్ లో ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ఇటీవల ఉప రాష్ట్రపది పదవికి మరో రెండేళ్ల గడువు ఉండగానే జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఆ పోస్టును భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అయితే తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.






