- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాసిక్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. రెండు వాహనాలు ఢీ, నలుగురు దుర్మరణం
నాసిక్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ వెహికల్ ను ట్రక్ ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ తాలూకాలోని షాహా-పంచాలే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు ఒక పికప్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. షిండేవాడి శివార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ట్రక్కు ఆ పికప్ వాహనాన్ని సుమారు 100 అడుగుల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఘర్షణ కారణంగా పికప్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ఒక ధార్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి పంచాలే గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం కాగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో కిరణ్ రవి మోరే (23), శుభమ్ గణేష్ నవలే (21) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే.. ఈ ప్రమాదాన్ని చూసి దిగ్భ్రాంతికి.. మానసిక ఆందోళనకు లోనై మీరాబాయి విశ్వనాథ్ గాంగుర్డే (68) అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది. ప్రమాదంలో మరణించినవారిలో మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వాహనం మంటలు అంటుకోవడానికి గల కారణాలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.






