పొగమంచు ఎఫెక్ట్.. నోయిడా హైవేపై ఒకదానినొకటి ఢీకొట్టిన వాహనాలు

by Ajay Maddhiboyina |

ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో పొగమంచు కప్పేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున ఎక్స్ ప్రెస్ హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి.

పొగమంచు ఎఫెక్ట్.. నోయిడా హైవేపై ఒకదానినొకటి ఢీకొట్టిన వాహనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో పొగమంచు కప్పేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున ఎక్స్ ప్రెస్ హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి. ప్రమాదంలో పలువురికి గాయాలవ్వగా వాహనాలు సైతం చాలా డ్యామేజ్ అయ్యాయి. గాయాలపాలైనవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను రోడ్ సేఫ్టీ అధికారులు షేర్ చేశారు.

నెమ్మదిగా ప్రయాణించాలని, డిస్టెన్స్ పాటించాలని కోరారు. లారీ డ్రైవర్స్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో పరిసరప్రాంతాల్లో వాయి కాలుష్యం పెరిగిపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో ముఖ్యమైన వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా అన్ని డీజిల్, పెట్రోల్ వాహనాలపై నిషేధం విధించారు. ప్రభుత్వ రంగ నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపైనా నిషేధం విధించారు.

Next Story