- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త పోప్ ‘లియో XIV’.. యూఎస్‌కు చెందిన రాబర్ట్ ప్రెవోస్ట్ ఎంపిక
by Phanindra |
కొత్త పోప్‌గా యూఎస్‌కు చెందిన రాబర్ట్ ప్రెవోస్ట్ ఎంపికైనట్లు వాటికన్ ప్రకటించింది. ఆయన ‘14వ లియో’ పేరును తీసుకున్నట్లు తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: క్యాథలిక్ చర్చి నూతన పోప్‌గా యూఎస్ కార్డినల్ రాబర్డ్ ప్రెవోస్ట్ ఎన్నికయ్యారు. ‘14వ లియో’ పేరును తీసుకున్న ఆయన పోప్‌గా ఎన్నికైనట్లు గురువారం నాడు వాటికన్ ప్రకటించింది. చికాగోకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్.. తన జీవితంలో చాలాకాలం పెరులో మిషనరీ సేవలు చేస్తూ గడిపారు. 2023లోనే కార్డినల్‌గా ఎంపికైన ఆయన 267వ క్యాథలిక్ పోప్‌గా ఎన్నికైనట్లు ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మంబెర్టి ప్రకటించారు. కాగా, 12 ఏళ్లుగా క్యాథలిగ్ చర్చిని ముందుండి నడిపించిన పోప్ ఫ్రాన్సిస్.. ఏప్రిల్ నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Next Story






