- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్.. తొలిరైలు ఈ మార్గంలోనే..
కేంద్రప్రభుత్వం చొరవతో ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రప్రభుత్వం చొరవతో ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయం.. వందేభారత్ ల రాకతో సగానికి సగం తగ్గింది. కానీ టికెట్ రేటు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇది పేద, మధ్య తరగతి ప్రజలకోసం కాదన్న విమర్శలున్నాయి. కాగా.. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ వెర్షన్ ను సైతం ఇండియన్ రైల్వే తీసుకురాబోతోంది. తేజస్ తరహా వేగం.. రాజధాని రైలు తరహా సౌకర్యాలతో.. తొలి స్లీపర్ రైలు ఢిల్లీ - పాట్నా మార్గలో నడవనుంది. డిసెంబర్ చివరి నాటికి వందేభారత్ స్లీపర్ రాకపోకలు సాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ 16 కోచ్ లతో రూపొందుతుండగా.. 827 బెర్తులు ఉండనున్నాయి.ఇందులో 611 థర్డ్ ఏసీ, 188 సెకండ్ ఏసీ, 24 ఫస్ట్ ఏసీ బెర్తులు ఉంటాయి. ఆటోమెటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీతో సౌకర్యంగా ఉండే ఇంటీరియర్ తో డిజైన చేస్తున్నారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వారంలో ఆరురోజుల పాటు రాకపోకలు సాగించనుంది.






