- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్..
ఆటోమెటిక్ డోర్లు, కుషన్ బెర్తులు, వైఫై కూడా అందుబాటులో ఉండనుంది.

- ట్రయల్స్ పూర్తి చేసుకున్న స్లీపర్ ట్రైన్
- త్వరలోనే సర్టిఫికేషన్ పూర్తి
- త్వరలోనే అందుబాటులో వందేభారత్ స్లీపర్ ట్రెయిన్స్
దిశ, నేషనల్ బ్యూరో: వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్‌ను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 24 కోచ్‌లతో కూడిన ఈ స్లీపర్ ట్రెయిన్స్.. రైల్వే చరిత్రంలో విప్లవాత్మక మార్పును తీసుకొని రానున్నాయి. వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రయల్స్‌ను రైల్వే శాఖ విజయవంతంగా చేపట్టింది. 16 కోచ్‌లతో కూడిన ట్రెయిన్‌ను ముంబై-అహ్మదాబాద్ మధ్య ఉన్న 540 కిలోమీటర్ల ట్రాక్‌పై పరిశీలించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్ట్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ) ఆధ్వర్యంలో ఈ రైలుకు కఠినమైన పరీక్షలు నిర్వహించారు. 2024 డిసెంబర్ 17న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 16 బోగీల వందే భారత్ స్లీపర్‌ను రైల్వే శాఖకు అప్పగించింది. తొలుత కోటా డివిజన్‌లో 30 నుంచి 40 కిలోమీటర్ల ట్రాప్‌పై పరీక్షలు నిర్వహించారు. ఈ ట్రెయిన్ 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌లో కూడా ఎలాంటి సమస్య లేకుండా పరుగులు పెట్టింది. కాగా ఆర్‌డీఎస్‌ఓ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి కూడా పొందవలసి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో మరిన్ని వందే భారత్ స్లీపర్ కోచ్‌లను తయారు చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో వందే భారత్ స్లీపర్ ప్రొడక్షన్‌పై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, ఏసీ 3 టైర్ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ ట్రెయిన్‌లో 1,128 మంది ప్రయాణించే వీలుంది. ఆటోమెటిక్ డోర్లు, కుషన్ బెర్తులు, వైఫై కూడా అందుబాటులో ఉండనుంది.






