జమ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. పర్యాటకులను ఫిదా చేస్తున్న వందే భారత్ జర్నీ

by Ajay Maddhiboyina |

జ‌మ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా మరింత సుందరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మంచు కొండలు, చినాబ్ బ్రిడ్జ్ మీదుగా సాగే వందే భారత్ ప్రయాణం అద్భుతంగా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. పర్యాటకులను ఫిదా చేస్తున్న వందే భారత్ జర్నీ
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌మ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా మరింత సుందరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మంచు కొండలు, చినాబ్ బ్రిడ్జ్ మీదుగా సాగే వందే భారత్ ప్రయాణం అద్భుతంగా మారింది. ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ మార్గంలో ప్రయానించేందుకు చాలా మంది టూరిస్టులు ఆసక్తి చూపిస్తున్నారు. ముంచు భారీగా కురవడంతో విదేశాల్లో ఎలాంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయో అలాంటి సన్నివేశాలే ఇప్పుడు జమ్మూకశ్మీర్ లోనూ కనిపిస్తున్నాయి.

గురువారం నుండి రెండు ప‌శ్చిమ ద్రోణి తుఫాన్లు ఈ ప్రాంతాన్ని స‌మీపించ‌డంతో వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అక్క‌డ -2 డిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. రాబోయే కొద్దిరోజుల్లో గుల్మార్గ్, ప‌హ‌ల్గామ్, అనంత‌నాగ్, కుల్గామ్, షోపియ‌న్ మ‌రియు సోనామార్గ్ లాంటి ప్రాంతాల‌లో తేలిక‌పాటి నుండి భారీ హిమ‌పాతం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. దిగువ లోయ‌ల‌లో కూడా మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆ ప్రాంతాల్లో వాహ‌నాల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌గా రాబోయే రోజుల్లో అది మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Next Story