- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైష్ణోదేవి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు - విద్యార్థులకు ఎన్‌ఎంసీ భరోసా
జమ్ము లోని శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గట్టి షాక్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ కాలేజీకి ఇచ్చిన అనుమతిని (LoP) తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: జమ్ము లోని శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీ (Shri Mata Vaishno Devi Medical College)కి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గట్టి షాక్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ కాలేజీకి ఇచ్చిన అనుమతిని (LoP) తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో వర్చువల్ విధానంలో అనుమతి పొందిన ఈ కాలేజీలో సరైన వసతులు లేవని ఫిర్యాదులు రావడంతో ఎన్‌ఎంసీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి, శిక్షణా సామగ్రిలో లోపాలు బయటపడటంతో నిబంధనల ప్రకారం గుర్తింపును వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఆకస్మిక తనిఖీలో వెల్లడైన వాస్తవాలు, నివేదిక ఆధారంగానే కాలేజీకి ఇచ్చిన అనుమతిని (LoP) వెనక్కి తీసుకుంటున్నట్లు డాక్టర్ శేత్ స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించని పక్షంలో అనుమతులు రద్దు చేయడం గతంలోనూ జరిగిందని, ఇది కొత్తేమీ కాదని ఆయన గుర్తుచేశారు. వైద్య విద్యలో నాణ్యతను కాపాడే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనల ఉల్లంఘనను ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ నిర్ణయంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ శేత్ భరోసా ఇచ్చారు. కాలేజీలో చేరాల్సిన విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా, వారిని జమ్ము కాశ్మీర్‌లోని ఇతర గుర్తింపు పొందిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా, ఇతర కాలేజీల్లో అదనపు సీట్లు ఏర్పాటు చేసైనా వారికి న్యాయం చేస్తామని, కేవలం వైద్య విద్యా ప్రమాణాలను పరిరక్షించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.






