- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే..
సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు నిర్మించనున్న రోప్‌వే కోసం అత్యంత అధునాతమైన ట్రై కేబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) టెక్నాలజీని వినియోగించనున్నారు.

- ఉత్తరాఖండ్‌కు రోప్‌వే ప్రాజెక్టులు
- పశువుల ఆరోగ్యం, రోగ నిరోధానికి ప్రత్యేక పథకం
- కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
దిశ, నేషనల్ బ్యూరో: పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌కు రెండు రోప్‌వేలు మంజూరు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కూడా ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం రెండు రోప్‌వే ప్రాజెక్టుల8 చేపట్టనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను సందర్శించుకోవడానికి ఇప్పటి వరకు గుర్రాలు, డోలీలు లేదా నడక ద్వారా కొండలను ఎక్కాల్సి వస్తుంది. దీని వల్ల వృద్ధులు, రోగాలతో బాధపడేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్‌వేను నిర్మించను్నారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్దతిలో ఈ రోప్‌వేను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. ఇందుకు రూ.4.081 కోట్లు ఖర్చు చేయనున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. కేంద్ర చేపట్టిన పర్వతమాల పరియోజనలో భాగంగా ఈ రోప్‌వేను నిర్మించనున్నారు.
సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు నిర్మించనున్న రోప్‌వే కోసం అత్యంత అధునాతమైన ట్రై కేబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి గంటకు 1,800 మంది ప్రయాణికులను తరలించే అవకాశం ఉంది. ఇక గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ జీ రోప్‌వే ప్రాజెక్టును కూడా డీబీఎఫ్ఓటీ పద్దతిలోనే నిర్మించనున్నారు. ఇందుకు రూ.2,730 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో 15,000 అడుగుల ఎత్తులో ఉన్న హేమ్‌కుండ్ సాహిబ్ జీ సిక్కులకు ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉంది. ఈ గురుద్వారను ఏడాదిలో ఐదు నెలల పాటు మాత్రమే తెరిచి ఉంచుతారు.
రైతులకు గుడ్ న్యూస్..
కేంద్ర కేబినెట్‌లో మరో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. పశువుల ఆరోగ్యం, రోగ నిరోధానికి రూ.3,880 కోట్లతో నిధిని ఏర్పాటు చేయనుంది. పశువుల ఆరోగ్యం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు తక్కువ ధరకే మందులు అందించనున్నారు. ఇందుకోసం పశు ఔషధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పశు ఉత్పాదకత మెరుగు పరచడం ద్వారా రైతులకు ఉపాధిని సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గ్రామాల్లో పశువులు వ్యాధుల బారిన పడుతుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ (ఎఫ్ఎండీ), బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధుల వల పశువుల మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టడానికే కేంద్రం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది.






