ఆర్ఎస్ఎస్ సహకారాన్ని అధికారికంగా గుర్తించిన ఉత్తరాఖండ్ శాసనసభ

by Malleboina Mahesh |

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (RSS) సహకారాన్ని అధికారికంగా గుర్తించిన తొలి రాజ్యాంగ సంస్థగా ఉత్తరాఖండ్ శాసనసభ చరిత్ర సృష్టించింది.

ఆర్ఎస్ఎస్ సహకారాన్ని అధికారికంగా గుర్తించిన ఉత్తరాఖండ్ శాసనసభ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (RSS) సహకారాన్ని అధికారికంగా గుర్తించిన తొలి రాజ్యాంగ సంస్థగా ఉత్తరాఖండ్ శాసనసభ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, “వందేళ్లుగా అంకితభావం, సేవ, క్రమశిక్షణతో పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా జాతీయ చైతన్యానికి శాశ్వత జ్యోతిని వెలిగించిందని అన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, సామాజిక సామరస్యం, స్వీయ గౌరవం, అచంచల దేశభక్తి పెంపొందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషించింది” అని పేర్కొన్నారు. అలాగే ఒకప్పుడు వలసవాద భావనల బరువులో నలిగిన భారత్‌ ఇప్పుడు తన సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ దృక్పథం, శాశ్వత సంప్రదాయాల పట్ల గర్వపడుతోందని ఈ సందర్భంగా సీఎం ధామి అన్నారు. “శతాబ్దకాలం నిస్వార్థ సేవ, అచంచల సంకల్పం వల్లే ఈ పరివర్తన సాధ్యమైంది” అని సీఎం పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు.

Next Story