- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్‌పై గ్యాంగ్ రేప్.. పట్టుబడుతామనే భయంతో క్రూరంగా హింస.. పొలంలోనే పాపను..
* ఉత్తరాఖండ్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ *పట్టుబడుతామనే భయంతో ముగ్గురు నిందితుల క్రూరత్వం * పొలంలోనే పాపను అలా చేయడంతో.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. పద్నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు యువకులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా.. పట్టుబడుతామనే భయంతో మరింత క్రూరంగా వ్యవహరించారు నిందితులు. ఓ ఇంట్లో గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు.. ఆ తర్వాత ఆ ఇంటిపై నుంచి బాధితురాలిని పొలాల్లో విసిరేశారు. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. పొలాల్లోనే పాపను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తక్షణమే నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. పవిత్ర నగరమైన హరిద్వార్‌లో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నిందితులైన ముగ్గురిలో ఓ మైనర్ కూడా ఉండగా.. వీరంతా మరో మతానికి చెందిన వారని.. వ్యతిరేక మతానికి చెందిన అమ్మాయిపై ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది.






