- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arattai: వాట్సాప్ లేకపోతేనేం అరట్టై వాడుకోండి.. సుప్రీం నోట అరట్టై మాట
వాట్సాప్ ఖాతా బ్లాక్ చేశారని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు అరట్టై పేరును ప్రస్తావించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై' పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఈ యాప్‍పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ లేకపోతేనేం.. అరట్టై యాప్ (Arattai app) వాడొచ్చు కదా అని ఓ పిటిషనర్‍కు సూచించింది. తన అకౌంట్‍ను వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని తిరిగి పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అలాగా సామాజిక మాధ్యమాలు ఇలా ఖాతాలను అకస్మాత్తుగా నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయావాది కోరారు. పిటిషనర్ పాలిడయాగ్నిక్ సెంటర్‍లో పని చేస్తున్నారు. గత 10-12 ఏళ్లుగా వాట్సాప్‍లోనే తన క్లయింట్‍లతో టచ్‍లో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్ చేశారని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్‍పై ఒకింత అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వాట్సాప్ లేకపోతే ఏంటీ కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్‍లు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించవచ్చు కదా అని ప్రశ్నించింది. ఈ మధ్య స్వదేశీ యాప్ అరట్టై కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి. మేక్ ఇన్ ఇండియా అని సూచించింది. ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైనది కాదని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. వాట్సాప్ యాక్సెస్ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది.
కాగా వాట్సాప్ కు పోటీగా మార్కెట్లోకి వచ్చిన స్వదేశీ మెసెజింగ్ యాప్ 'అరట్టై'కు ప్రస్తుతం భారీగా ప్రజాదరణ లభిస్తోంది. తమిళనాడుకు చెందిన శ్రీధర్ వెంబు కు చెందిన జోహో సంస్థ ఈ యాప్ ను రూపొందించింది. ఆయితే ఈ యాప్ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉందని అందుకే కేంద్ర మంత్రులు సైతం జోహో, అరట్టైని ప్రమోట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు అరట్టై యాప్ ను ప్రస్తావించడం ఆసక్తిగా మారింది.






