- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USAID:1600 మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై వేటు.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ఉద్యోగులపై వేటు వేశారు. 1600 మందికి పైగా ఎంప్లాయీస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మరికొంత మంది ఉద్యోగులకు వేతనంతో కూడిన బలవంతపు సెలవులు ఇచ్చి పంపించారు. ఈ మేరకు సదరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ‘యూఎస్ మిషన్-క్లిష్టమైన విధులు, ప్రధాన నాయకత్వం, ప్రత్యేకంగా నియమించబడిన కార్యక్రమాలకు బాధ్యత వహించే సిబ్బందిని మినహాయించి, అన్ని యూఎస్ఎయిడ్ డైరెక్ట్ హైర్ సిబ్బందిని ప్రపంచవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉంచుతారు’ అని నోటీసులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది నాయకులను, అవసరమైన సిబ్బందిని మాత్రమే విధుల్లో కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. యూఎస్ఎయిడ్ ఉద్యోగులను తొలగించేందుకు ఫెడరల్ న్యాయమూర్తి ఇటీవల అనుమతించిన తర్వాత ట్రంప్ పరిపాలనా విభాగం ఈ చర్యలు తీసుకుంది.
కాగా, యూఎస్ ఎయిడ్ అనేది అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది విదేశాలకు సహాయం అందించడానికి తోడ్పడుతుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ దీనిని స్థాపించారు. అయితే ఇటీవల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విదేశీ సహాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాంతక వ్యాధులపై పోరాడే కార్యక్రమాల నుంచి ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించడం వరకు ప్రతిదానికీ నిధులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే అందులోని ఉద్యోగులను తొలగించడం గమనార్హం.






