- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tulsi Gabbard: భారత్‌ను సందర్శించనున్న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్
భారత్‌కు వస్తున్న మొదటి ఉన్నత స్థాయి వైట్‌హౌస్ అధికారి తులసి గబార్డ్ కావడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) తులసి గబార్డ్ ఇండో-పసిఫిక్ పర్యటనలో భాగంగా భారత పర్యటనకు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత భారత్‌కు వస్తున్న మొదటి ఉన్నత స్థాయి వైట్‌హౌస్ అధికారి తులసి గబార్డ్ కావడం గమనార్హం. గబార్డ్ తన పర్యటనలో భాగంగా భారత్‌తో పాటు జపాన్, థాయిలాండ్ దేశాలకు సందర్శిస్తారు. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాలు, రక్షణ, నిఘా సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతాంలో శాంతి, స్వేచ్ఛ, శ్రేయస్సును సాధించే ట్రంప్ లక్ష్యాలకు మద్దతుగా మెరుగైన సంబంధాలు, అవగాహన, ఓపెన్ కమ్యూనికేషన్ మార్గాలకు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి భారత్‌లో ఆమె సమావేశాలకు సంబంధించి నిర్దిష్టమైన వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. మార్చి 15న తులసి గబార్డ్ థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు వస్తారని భావిస్తున్నారు. ఇతర ఇంటెలిజెన్స్, భద్రతా అధికారులు కూడా అదే రోజు న్యూఢిల్లీకి చేరుకుంటారని సమాచారం. దోవల్ నేతృత్వంలో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు.






