- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజా పౌరులకు అమెరికా షాక్... వీసాలు నిలిపివేత
ఓ వైపు ఇజ్రాయెల్ తో యుద్ధం, మరోవైపు ఆకలి కేకలతో సతమతం అవుతున్న గాజా నెత్తిన మరో పిడుగు వేసింది అమెరికా.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు ఇజ్రాయెల్ తో యుద్ధం, మరోవైపు ఆకలి కేకలతో సతమతం అవుతున్న గాజా నెత్తిన మరో పిడుగు వేసింది అమెరికా. తాజాగా గాజా పౌరులకు వీసాలు నిలిపివేసింది అమెరికా. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేకమంది గాజా పౌరులు చికిత్స పొందేందుకు అమెరికా వస్తున్నట్టు సమాచారం అందుకున్న అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మానవతా దృక్పతంతో జారీ చేసే తాత్కాలిక వీసాల జారీ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే చికిత్స పేరుతో అమెరికా చేరుకుంటున్న పాలస్తీనియన్స్ హమాస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని తెలిపారు. హమాస్ కు సపోర్ట్ చేస్తూ, నిధులు వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇటీవల తీవ్రంగా గాయపడిన 11 మంది గాజా చిన్నారులను 'హీల్ పాలస్తీనా' అమెరికాకు తరలించిందని.. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం చేసింది. ఈక్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే అమెరికా నిర్ణయంపై యూఎస్ లో పనిచేస్తున్న 'పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్' స్వచ్చంద సంస్థతో సహా పలు ఎన్జీవోస్ తీవ్రంగా ఖండించాయి. తక్షణమే అమెరికా ఇలాంటి అమానవీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసాయి. అసలే యుద్శం వల్ల, ఆకలితో వేలమంది చనిపోతుంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి.






