- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో వారానికి 350 కరోనా మరణాలు!
అమెరికాలో వారానికి 350 కరోనా మరణాలు నమోదవుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. ఇమ్యూనిటీ తగ్గడమే దీనికి కారణమని చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాను కూడా ఇంకా కరోనా నీడ వదల్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కనుమరుగైన సమయంలో కూడా యూఎస్‌లో కొవిడ్ మరణాలు వెలుగు చూసినట్లు అక్కడి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఏప్రిల్ నెలలో అమెరికాలో సగటున వారానికి 350 కరోనా మరణాలు నమోదైనట్లు సీడీసీ వెల్లడించింది. తక్కువ మంది వ్యాక్సీన్ తీసుకోవడం, చాలా మందిలో ముఖ్యంగా వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు అంటున్నారు. అలాగే వైరస్ సోకిన మూడు, నాలుగు రోజుల్లోనే వైద్యసహకారం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని, కానీ చాలామంది చాలా ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్లడం కూడా కరోనా మరణాలకు కారణం అవుతోందని వారు చెప్తున్నారు.
అమెరికాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. హుటాహుటిన తయారు చేసిన ప్రయోగాత్మక మెడిసిన్ అయిన వ్యాక్సీన్‌ను సరైన ప్రయోగాలు లేకుండా ప్రజలకు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నించారు. దీంతో యూఎస్‌లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా జరిగిందని, ఇది కూడా కరోనా మరణాలకు కారణమేనని నిపుణులు చెప్తున్నారు. ఇక సాధారణంగానే మనుషుల్లో రోగనిరోధక శక్తి వయసు పెరిగేకొద్దీ తగ్గుతుందని, వ్యాక్సీన్ వల్ల అందే వైరస్ నిరోధక శక్తి కూడా తగ్గుముఖం పడుతుందని నిపుణులు తెలియజేశారు. దీంతో మళ్లీ కరోనా సోకే ప్రమాదం పెరుగుతుందని, కొత్త వేరియంట్లు అమెరికాలో అడుగు పెట్టిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






