- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా.. హర్మూజ్ జలసంధి మూసివేత!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో హోర్ముజ్ జలసంధి మూతపడింది.

దిశ, వెబ్‌డెస్క్: సీజ్ ఫైర్ నేపథ్యంలో పశ్చిమాసియా (Western Aisa)లో యుద్ధ వాతావరణం మళ్లీ వేడెక్కింది. హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా (America) నౌకాదళం ఓ ఇరాన్ (Iran) కార్గో నౌకను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) ధిక్కరించి వెళ్తున్న ‘టౌస్కా’ (Touska) అనే ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేసింది. నౌక ఇంజిన్ రూమ్‌ను ధ్వంసం చేసి, అమెరికా మెరైన్లు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
ఇరాన్ హెచ్చరిక..
ఇరాన్‌పై నౌకపై అమెరికా చర్యను సముద్రపు దొంగతనంగా ఇరాన్ అభివర్ణించింది. దీనిపై త్వరలోనే తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా 7.5 శాతానికి మేర పెరిగి ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి. మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఇస్లామాబాద్‌లో రెండో విడత శాంతి చర్చలు జరపాలని పాక్ ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అందుకు విముఖత చూపుతోంది. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే హెచ్చరించారు.






