- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nuclear Entities: భారత్ లోని 3 అణుకేంద్రాలపై ఆంక్షల తొలగింపు
భారత్‌లోని(India) అణుకేంద్రాలపై అమెరికా(US) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ముఖ్యమైన అణు కేంద్రాలపై(3 Indian Nuclear Entities) ఆంక్షలను అమెరికా తొలగించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోని(India) అణుకేంద్రాలపై అమెరికా(US) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ముఖ్యమైన అణు కేంద్రాలపై(3 Indian Nuclear Entities) ఆంక్షలను అమెరికా తొలగించింది. ఈ మేరకు యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ (BIS) ప్రకటన చేసింది. ఇంటర్ ఏజెన్సీ రివ్యూ తర్వాత ఆంక్షలు తొలగించినట్లు బీఐఎస్ ప్రకటించింది. శాంతియుత అణు సహకారం, అనుబంధ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సహకారం రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వారి భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చిందని పేర్కొంది. ఈ మేరకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (IGCAR), ఇండియన్ రేర్ ఎర్త్స్ (IRE) అనే మూడు సంస్థలపై ఆంక్షలు ఎత్తివేసినట్లు తెలిపింది.అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్.. భారత్‌లో పర్యటించిన వారం రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. పౌర అణు భాగస్వామ్యం విషయంలో రెండు దేశాల సంస్థ మధ్య నెలకొన్న అడ్డంకులను తాము తొలగిస్తున్నట్లు అప్పటి పర్యటనలో ఆయన తెలిపారు. 16 ఏళ్ల కిందట కుదిరిన అణు ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బైడెన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
పదహారేళ్ల క్రితం ఒప్పందం..
కాగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొన్నిరోజుల ముందు ఈ పరిణామం జరగడం గమనార్హం. కాగా.. జూలై 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తో భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత పౌర అణుశక్తిలో సహకరించుకునే ప్రతిష్టాత్మక ప్రణాళికను భారత్, అమెరికా ఆవిష్కరించాయి. మూడేళ్లపాటు వరుస చర్చల తర్వాత చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదిరింది. భారతదేశంతో పౌర అణు సాంకేతికతను అమెరికా పంచుకోవడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని భావించారు. ఇప్పుడు, ఆ ఒప్పందాన్ని అణలు చేసేందుకు రెడీ అయ్యారు.






