ప్రధాని మోడీ వ్యాఖ్యలను స్వాగతించిన యూఎస్

by Dishanational2 |
ప్రధాని మోడీ వ్యాఖ్యలను స్వాగతించిన యూఎస్
X

న్యూయార్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణను యూఎస్ స్వాగతించింది. ప్రధాని మోడీ మాటలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉద్దేశించి పుతిన్‌తో ఫోన్ కాల్‌లో అన్ని రకాల హింసలకు స్వస్తి పలకాలని, దౌత్య మార్గాన్ని అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు జరిగినప్పుడు వాటిని స్వాగతిస్తామని యూఎస్ తెలిపింది. రష్యాతో ఎంగేజ్‌మెంట్‌పై ఇతర దేశాలు తమ స్వంత నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అయితే యుద్ధ ప్రభావాలను తగ్గించడానికి తాము మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటామని విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ అన్నారు. అంతకుముందు కూడా భారత్ ఓ సందర్భంగా పుతిన్‌కు ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్‌తో పాటు పలు దేశాలు సానుకూలంగా స్పందించాయి.


Next Story

Most Viewed