వెనిజులా వనరులు మాకివ్వాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లింక తప్పదు: ట్రంప్

by Phanindra |

వెనిజులా వనరులు మాకివ్వాల్సిందేనని, లేదంటే భారీ మూల్యం చెల్లింక తప్పదని ట్రంప్ హెచ్చరించారు.

వెనిజులా వనరులు మాకివ్వాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లింక తప్పదు: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ అధ్యక్షురాలిగా ఆమె ప్రమాణం చేయడాన్ని ముందు స్వాగతించిన ట్రంప్.. ఆ తర్వాత తమ దేశంలోని సహజ వనరులను కాపాడుకుంటామంటూ డెల్సీ ప్రకటించగానే మండిపడ్డారు. డెల్సీ సరిగా నడుచుకోకపోతే మదురో కంటే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూఎస్‌లోకి డ్రగ్స్ పంపుతున్నారంటూ వెనిజులాపై దాడి చేసి, మదురోను అరెస్టు చేసిన అమెరికా.. ఆ తర్వాత నుంచి వెనిజులా సహజ వనరులపై ఫోకస్ పెట్టారు. అక్కడి ఆయిల్ నిల్వలను యూఎస్ కంపెనీలు చేతికి అందించాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో సహజ వనరులను కాపాడుకుంటూమంటూ డెల్సీ ప్రకటించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆమె కనుక సరైన పద్ధతిలో నడుచుకోకుంటే.. మదురో భారీ మూల్యం చెల్లించుకుంటుంది’ అంటూ ట్రంప్ బెదిరించారు.

తాజాగా ప్రమాణం చేసిన వారితో డీల్ చేస్తున్నామని, అదే సమయంలో మరోసారి సైనిక దళాలను పంపేందుకు తాము రెడీగా ఉన్నామని ట్రంప్ చెప్పారు. వెనిజులాలో సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వెనిజులాలోని చమురు, ఇతర సహజ వనరుల నిల్వలపై యూఎస్‌కు వంద శాతం యాక్సెస్ ఇవ్వాల్సిందేనని ట్రంప్ తేల్చిచెప్పారు. వేరే దేశాధ్యక్షుడిని బంధించడాన్ని కూడా సమర్థించుకున్న ట్రంప్.. ‘అక్కడ పునర్నిర్మాణం చేయడం లేదా అధికారాన్ని మార్చడం.. ఏ పేరుతో అయినా పిలవండి. కానీ అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే అదే బెటర్. ఇంతకంటే పరిస్థితి దిగజారేది ఏమీ ఉండదు’ అని చెప్పుకొచ్చారు.

Next Story