ఏ సాయం కావాలన్నా సిద్ధం.. ఎయిరిండియా ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్

by Phanindra |   (  Updated:2025-06-12 19:16:48  IST  )

ఎయిరిండియా ప్రమాదంపై యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్ ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఏ సాయం కావాలన్నా సిద్ధం.. ఎయిరిండియా ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన ఘటనపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘భారత్ చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే అక్కడకు వస్తామని చెప్పా’ అని ట్రంప్ తెలిపారు. విమానయాన చరిత్రలో అహ్మదాబాద్ ఘటనను ఒక ఘోరమైన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. ‘ఇది చాలా ఘోరమైన క్రాష్. అసలు ఇదేంటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. నేను కూడా నా ఆలోచనలను వారికి చెప్పా. విమానం బాగానే వెళ్తు్న్నట్లు కనిపించింది. కానీ అంతలోనే ఇలా జరిగింది. అసలు పేలుడు జరుగుతుందని కూడా అనిపించలేదు. ఏదో ఇంజిన్లు శక్తి కోల్పోయినట్లు మాత్రమే అనిపించింది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Next Story