- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian immigrants: భారత్ చేరుకున్న అక్రమవలసదారుల తొలి విమానం
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నారని.. ప్రచారం జరుగుతున్నట్లుగా 205 మంది లేరని ప్రకటించారు. వీరందరినీ అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా అక్రమ వలసదారులతో భారత్ కు వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం.
ట్రంప్ సర్కారు నిర్ణయం
గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి స్వస్థలాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే తొలిదశలో 104 మందిని భారత్ కు పంపించారు. అయితే, ఇప్పుడు భారత్‌కు వచ్చిన వీరిని ప్రభుత్వం నేరస్థులుగా చూడదు. అక్రమవలసదారులకు పాస్‌పోర్ట్‌లు అందుబాటులో లేకపోతే, బయోమెట్రిక్స్ ఉపయోగించి వారిని గుర్తించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని అంటున్నారు. అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే అని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్(Jai Sankar) తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు.






