USAID: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు షాక్ ఇచ్చిన కోర్టు

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)కు అక్కడి ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ తీర్పు వెలువరించారు.

USAID: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు షాక్ ఇచ్చిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)కు అక్కడి ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ తీర్పు వెలువరించారు. ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)లోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీటికే బ్రేక్ వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ నిర్ణయం వల్ల విదేశాల్లోని యూఎస్ఏఐడీ ఉద్యోగులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అసోసియేషన్, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఉద్యోగులు వాదనలు వినిపించారు. ఉద్యోగుల వాదనలు అంగీకరించిన కోర్టు.. ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాక.. ఇప్పటికే సెలవులో ఉన్న యూఎస్‌ఏఐడీ (USAID) సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే, కోర్టు విచారణకు ముందు ‘యూఎస్ఏఐడీని క్లోజ్ చేయాలి’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

పది వేల మంది ఉద్యోగులకు బైబై

అయితే, యూఎస్‌ఏఐడీలో 10 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని ట్రంప్ సూచిస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగానే మిగితా వారందరూ 30 రోజుల్లోగా ఖాళీ చేయాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సహాయసంస్థను తీవ్రవాదులు, ఉన్మాదులు నడుపుతున్నారని ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాదాపు 120 దేశాలకు మానవతా సాయం అందేచేందుకు యూఎస్ఏఐడీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది. ఇకపోతే, యూఎస్ఎఏఐడీ సంస్థ నేరగాళ్లకు చెందినదని టెస్లా అధినేత మస్క్ కూడా ఆరోపణలు చేశారు.

Next Story