- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USA: జమ్ముకశ్మీర్ కు వెళ్లొద్దు.. అమెరికన్లకు ట్రంప్ సర్కారు అడ్వైజరీ
పెహల్గాం ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. దీంతో, ఆ ప్రాంతంలో పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా (USA) అప్రమత్తమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. దీంతో, ఆ ప్రాంతంలో పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా (USA) అప్రమత్తమైంది. తమ దేశానికి చెందిన పౌరులెవరూ జమ్ముకశ్మీర్‌కు వెళ్లవద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఆ ప్రాంతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. అక్కడ మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని పేర్కొంది. సైనిక ఘర్షలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల సమీపంలోకి కూడా వెళ్లొద్దని తెలిపింది. తూర్పులడఖ్ రాజధాని లేహ్‌కు వెళ్లొచ్చని వెల్లడించింది. ఇక నియంత్రణ రేఖ వద్ద కూడా హింసాత్మక ఘటనలు జరగే ఛాన్స్ ఉందంది. కశ్మీర్‌లోయలోని శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్గామ్‌లో హింస చెలరేగవచ్చని అంచనా వేసింది.
ఉగ్రదాడిని ఖండించిన ట్రంప్
మరోవైపు, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంగళవారం నేరుగా ప్రధాని మోడీకి ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఉగ్రవాద పోరుతో భారత్ కు అండగా ఉంటామన్నారు. ముష్కరులను పట్టుకోవడంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా.. ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.






