Trade Deal: భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

by Shamantha N |

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాల కోసం నిబంధనలు ఖరారు చేశామన్నారు.

Trade Deal: భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై జేడీ వాన్స్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాల కోసం నిబంధనలు ఖరారు చేశామన్నారు. వాణిజ్య సంబంధాలు న్యాయబద్ధతపై ఆధారపడి ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం తర్వాత మంగళవారం జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "మా పరిపాలన న్యాయంగా, ఉమ్మడి జాతీయ ప్రయోజనాల ఆధారంగా వాణిజ్య భాగస్వాములను కోరుకుంటుంది. ఎగుమతులను పెంచడానికి వారి వేతనాలను అణచివేయకుండా.. శ్రమ విలువను గౌరవించే మా విదేశీ భాగస్వాములతో మేం సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనుకంటున్నాం" అని వాన్స్ అన్నారు. వాణిజ్యానికి మార్గంగా మారడానికి మాత్రమే కాకుండా.. అమెరికాతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్న భాగస్వామ్యులనే కోరుకుంటున్నామన్నారు. న్యాయమైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం గురించి అని ఆయన నొక్కి చెప్పారు. అమెరికా భాగస్వాముల ప్రభుత్వాలు అమెరికా మాదిరిగానే పనులు చేయనవసరం లేదని.. కానీ వాటికి కొన్ని సాధారణ లక్ష్యాలు ఉండాలన్నారు. భారతదేశంతో ఈ సాధారణ లక్ష్యాలు ఆర్థిక, జాతీయ భద్రత రెండింటికీ సంబంధించినవని అన్నారు. మరోవైపు, కుటుంబంతో కలిసి రాజస్థాన్‌ రాజధాని జైపూర్ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఉన్నారు. భారత వారసత్వ సంపద, సంప్రదాయాలు చూసి తాను అబ్బురపడినట్లు వెల్లడించారు.

Next Story