Donald Trump: ట్రంప్‌ పవర్‌ అలా ఉంటుంది మరి.. పనామాపై పంతం నెగ్గిన ప్రెసిడెంట్!

by Vennela |

Donald Trump: పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు.

Donald Trump: ట్రంప్‌ పవర్‌ అలా ఉంటుంది మరి.. పనామాపై పంతం నెగ్గిన ప్రెసిడెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: Donald Trump: పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది.

తమ యుద్ధ నౌకలు ఈ కెనా్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకున్నారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొంది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.

నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే ఛాన్స్ ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన నెలకొంది. అమెరికాకు చెందిన 40శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్ తో సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన బీఆర్ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మోలినో హామీ ఇచ్చారు. ట్రంప్ ఇప్పటికీ అసంత్రుప్తిగా ఉన్నా.. ఆదేశం కొన్నింటికి అంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు.

నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయంతో 1914లో పనామా కాల్వను నిర్మించింది. దీనిని మొదట అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంత్రుప్తితో ఘర్షణలు చెలరేగాయి. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకున్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా కండిషన్ పెట్టింది. ఇక్కడ ఎలాంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ డెవలప్ మెంట్ కు భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.

Next Story