US military: చైనాను అరికట్టడానికి సైనిక స్థావరంగా హిందూ మహాసముద్ర ద్వీపంపై అమెరికా కన్ను

by S Gopi |
US military: చైనాను అరికట్టడానికి సైనిక స్థావరంగా హిందూ మహాసముద్ర ద్వీపంపై అమెరికా కన్ను
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా చమురు ఎగుమతుల కోసం వినియోగిస్తున్న హిందూ మహాసముద్రం చోక్‌పాయింట్‌కు దగ్గరగా ఉండే రిమోట్ ఆస్ట్రేలియన్ ద్వీపాన్ని అమెరికా తన సైనిక స్థావరంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో యూఎస్ సైనిక నిర్మాణం కోసం సాధ్యమయ్యే ప్రదేశాల జాబితాలో ఈ ద్వీపం కూడా ఉంది. అమెరికన్ దళాలు దీన్ని ఖరారు చేసే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పసిఫిక్ డిటరెన్స్ ఇనిషియేటివ్ కింద నిర్మాణ ప్రాజెక్టుల కోసం ఫిలిప్పీన్స్, తైమూర్ లెస్టే, పపువా న్యూ గినియాలతో పాటు ఆస్ట్రేలియాకు చేరువలో ఉండే కోకోస్ దీవులు లిస్ట్ చేయబడ్డాయి. ఇది చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా బలగాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఉంది. కోకోస్ దీవులు 600 మంది జనాభాతో ఆస్ట్రేలియన్ ప్రధాన భూభాగానికి పశ్చిమాన 3,000 కిమీ దూరంలో ఉంది. హిందూ మహాసముద్రంలో సముద్ర జలాంతర్గామి కార్యకలాపాలను చైనా పెంచుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిఘా కార్యకలాపాలపై ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ దృష్టి సారిస్తోంది. 'కోకోస్ దీవులను ప్రాజెక్ట్ లొకేషన్‌గా లిస్ట్ చేయడం ద్వారా అమెరికా మిలటరీ హిందూ మహాసముద్ర భూభాగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. అయితే, దీనిపై సరైన నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం పరిశీలనలోనే ఉందని' యూఎస్ నేవీకి చెందిన పసిఫిక్ ఫ్లీట్ ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధి రాయిటర్స్‌కి మెయిల్ ద్వారా బదులిచ్చారు.

Advertisement

Next Story