- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Us embassy: అక్రమ ప్రవేశాన్ని సహించబోము.. భారత్‌లోని యూఎస్ ఎంబసీ వెల్లడి
అమెరికాలోని న్యూవార్క్ ఎయిర్ పోర్టులో ఒక భారతీయ విద్యార్థిపై అధికారులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూవార్క్ ఎయిర్ పోర్టులో ఒక భారతీయ విద్యార్థిపై అధికారులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆయనను నేలపై పడేసి చేతులకు సంకెళ్లు వేసి బలవంతంగా బహిష్కరించారు. ఈ ఘటన సోషల్ మీడియాతో వైరల్ గా మారడంతో భారత్‌లోని యూఎస్ ఎంబసీ (Us Embossy) స్పందించింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహించబోమని తెలిపింది. చట్టబద్ధంగా ప్రయాణించే వారికే అనుమతిస్తామని పేర్కొంది. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, దేశంలోని చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఊరుకోబోమని వెల్లడించింది. యూఎస్‌ను సందర్శించడం ఎవరికీ ఓ హక్కు కాదని తెలిపింది. వీసా నియమాలను ఉల్లంఘించిన వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ పరిణామంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ (Jairam ramesh) స్పందించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల గౌరవాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమెరికాలో ఇండియన్స్‌పై జరుగుతున్న దౌర్జన్యాలపై జోక్యం చేసుకోవాలని, ఈ విషయంపై వెంటనే యూఎస్ అధ్యక్షుడు ట్రంపుతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. భారతీయులను కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.






