వీసా మోసాలపై భారతీయులకు యూఎస్ ఎంబసీ హెచ్చరిక

by Phanindra |   (  Updated:2025-06-07 01:44:58  IST  )

వీసా మోసాలపై భారతీయులకు యూఎస్ ఎంబసీ హెచ్చరికలు జారీచేసింది. బెంగళూరులో వీసా మోసం నేపథ్యంలో సూచనలు చేసింది.

వీసా మోసాలపై భారతీయులకు యూఎస్ ఎంబసీ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ప్రస్తుతం యూఎస్‌లో జరుగుతున్న పాలసీ మార్పులను ఉపయోగించుకుంటున్న కొందరు.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఎంబసీ తెలిపింది. తాజాగా బెంగళూరులో ఒక 45 ఏళ్ల ఇంజినీరుకు బీ1/బీ2 నాన్‌-ఇమ్రిగ్రెంట్ వీసా ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ ఎంబసీ స్పందించింది. యూఎస్ వీసా అప్లికేషన్ పోర్టల్స్‌లో ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, ఎవరైనా వీసా ప్రక్రియను వేగవంతం చేస్తామన్నా నమ్మొద్దని హెచ్చరించింది. ఎవరైనా కొంత ఫీజు తీసుకొని వీసా ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తామంటే అది కచ్చితంగా స్కామేనని ఎంబసీ స్పష్టంచేసింది. కాగా, వేగంగా యూఎస్ వీసా పొందడం కోసం థర్డ్ పార్టీ సహకారం కోరిన సదరు బెంగళూరు ఇంజినీరుకు ఎంబసీ నుంచి ఎలాంటి సహకారం అందదని, తనంతట తానే థర్డ్ పార్టీ వద్దకు వెళ్లిన ఇంజినీరు కూడా ఎంబసీ దృష్టిలో తప్పుచేసిన వాడేనని అధికారులు వివరించారు.

Next Story