- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో అమెరికా ఎంబసీ హెచ్చరిక
భారతలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారతలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాల ప్రాసెసింగ్‌లో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొందరు నకిలీ ఏజెంట్లు, మోసగాళ్లు "గ్యారంటీ వీసా", "త్వరగా అప్రూవల్ చేస్తాం" అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎంబసీ స్పష్టం చేసింది. డిసెంబర్ 15 నుంచి అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియా వెట్టింగ్‌ను విస్తరించడంతో వీసా ఇంటర్వ్యూలు, అపాయింట్‌మెంట్లలో ఆలస్యం అవుతున్నాయని పేర్కొంది.
హెచ్-1బీ వీసాల్లో భారతీయులే అధిక సంఖ్యలో కలిగి ఉండటం, ఈ ప్రభావం మరింతగా ఉందని తెలిపింది. వీసా కోసం ఎలాంటి షార్ట్‌కట్‌లు లేవని, ఏజెంట్లు మాటలు నమ్మవద్దని హెచ్చరిస్తూ, అపాయింట్‌మెంట్‌లు అధికారిక వెబ్‌సైట్ www.ustraveldocs.com ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించింది. అధికారిక సమాచారానికి travel.state.gov లేదా in.usembassy.gov/visas వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని సూచించింది.






