- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
54 మందిని వెనక్కి పంపిన అమెరికా.. డంకీ రూట్లపై పోలీసుల ఫోకస్
by Phanindra |
తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ 54 మంది భారతీయులను వెనక్కి పంపేసింది అమెరికా. దీంతో డంకీ రూట్లపై పోలీసుల ఫోకస్ పెడుతున్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: వలసదారులపై అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తమ దేశంలో అక్రమంగా ప్రవేశించారంటూ 54 మంది భారతీయులను అమెరికా వెనక్కు పంపింది. వీరంతా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారని, వీరిని వారి కుటుంబాలకు చేరుస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ 54 మందిలో హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కర్నాల్, ఖైతాల్, అంబాలా, యమునా నగర్, కురుక్షేత్ర, జింద్, సోనిపట్ నుంచి డంకీ మార్గంలో యూఎస్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వీరిని పంపిన ఏజెంట్లపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న అధికారులు.. ఇలా అక్రమంగా విదేశాలకు వెళ్లొద్దని, అలా వెళల్డం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హర్యానాకు చెందిన 16 మందిని వారి కుటుంబాల వద్దకు చేర్చినట్లు సమాచారం.
Next Story






