నెలరోజుల అంతరాయం తర్వాత హెచ్1బీ వీసా ప్రక్రియ పునఃప్రారంభం!

by Phanindra |

నెలరోజుల అంతరాయం తర్వాత హెచ్1బీ వీసా ప్రక్రియ పునఃప్రారంభం అయింది. ఈ విషయాన్ని యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

నెలరోజుల అంతరాయం తర్వాత హెచ్1బీ వీసా ప్రక్రియ పునఃప్రారంభం!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని ఆఫీస్ ఆఫ్ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ (ఓఎఫ్ఎల్‌సీ) సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత ఉద్యోగావకాశాల కోసం యూఎస్ వచ్చే వారి దరఖాస్తుల ప్రాసెస్ ప్రక్రియను యూఎస్ ప్రారంభించింది. ఫెడరల్ ఫండింగ్‌లో లోపాలు, ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దాదాపు నెలరోజులుగా ఈ సేవలు అందుబాటులో లేవు.

సెప్టెంబరు 30 నుంచి విదేశీ నిపుణులపై ఆధారపడే కంపెనీలకు కీలక సేవలను ఓఎఫ్‌ఎల్‌సీ నిలిపివేసింది. అయితే ఇప్పుడు అన్ని సేవలూ అందుబాటులోకి రావడంతో హెచ్1బీ వీసాల్లో లేబర్ కండిషన్ అప్లికేషన్లు (ఎల్‌సీఏ) దరఖాస్తులను సబ్మిట్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లలో తొలి అడుగైన ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ (పీఈఆర్ఎమ్) లేబర్ స్టిఫికెట్ల ప్రక్రియ కూడా మొదలైనట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ తెలిపింది.

Next Story