- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US-Iran: ఇరాన్‌పై అమెరికా 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ '
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా ఇచ్చిన ఆదేశాల మేరకే నిర్వహించామని పీట్ హెగ్సేత్ చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అణు కేంద్రాలపై సైనిక దాడులు అద్భుతమైన, అఖండ విజయాన్ని అందించాయని, తెహ్రాన్ అణు ఆశయాలను తుడిచిపెట్టాయని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఆదివారం అన్నారు. ఇరాన్‌లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై దాడులను ధృవీకరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రక్షణ శాఖ.. దీన్ని 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్'గా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా ఇచ్చిన ఆదేశాల మేరకే నిర్వహించామని పీట్ హెగ్సేత్ చెప్పారు. అమెరికా ఈ దాడుల్లో 75 ప్రెసిషన్-గైడెడ్ ఆయుధాలను ఉపయోగించింది. 14 బంకర్-బస్టర్ బాంబులు, ఇవి ఒక్కొక్కటి 13,000 కిలోల బరువు ఉంటాయి. ఈ బాంబులు పర్వతం లోపల లోతుగా పాతిపెట్టబడిన ఫోర్దో వంటి భూగర్భ ప్రదేశల్లోనూ చొచ్చుకుపోయేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. రెండు డజన్లకు పైగా టోమాహాక్ క్షిపణులు, 125కి పైగా సైనిక విమానాలు ఉన్నాయని అమెరికా అగ్ర జనరల్ జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. ఈ దాడులతో రాన్‌లోని అణు తయారీ కేంద్రాలకు భారీ ఎత్తున విఘాతం ఏర్పడింది. అయితే, ఈ దాడులతో తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదు. అంతేకాకుండా ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం కూడా తమ ఉద్దేశం కాదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌లో పాలన మారాలని అనుకోవట్లేదు. మా కమాండ్ ఇన్ చీఫ్ ట్రంప్ ఆదేశాలను పాటించామని పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు.






