America: ఛీఛీ.. శ్మశానంలో పాడుపడి చేస్తూ పట్టుబడిన జంట.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-04 07:52:34  IST  )

నిషేధిత డ్రగ్స్ తీసుకుని, బహిరంగ ప్రాంతంలో శృంగారంలో పాల్గొన్న

America: ఛీఛీ.. శ్మశానంలో పాడుపడి చేస్తూ పట్టుబడిన జంట.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: నిషేధిత డ్రగ్స్ తీసుకుని, బహిరంగ ప్రాంతంలో శృంగారంలో పాల్గొన్న జంటను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) మార్చి 26న ఈ ఘటన వెలుగుచూసింది. వెబ్‌స్టర్‌కు చెందిన జోసెఫ్ లూక్ బ్రౌన్(38) (Joseph Luke Brown), స్టెఫానీ కే వెగ్మన్(46) (Stephanie Kay Wegman) చారిత్రాత్మక శ్మశాన వాటికలోని 1850 నాటి ఓ సమాధిపై శృంగారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసులు రోజు వారి విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ శ్మశాన వాటిక ముందు వెగ్మన్‌కు చెందిన కారు అనుమానస్పదంగా పార్క్ చేసి కనిపించింది. దీంతో పోలీసులు దగ్గరకి వెళ్లి పరిశీలించగా, అందులో మెథాంఫెటమైన్ సహా పలు నిషేధిత డ్రగ్స్ కనిపించాయి. చుట్టూ పక్కల తనిఖీ చేయగా, అసభ్యకరమైన పరిస్థితిలో వీరు కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, వెగ్మన్‌ను కౌంటీ జైలుకు తరలించగా, జోసెఫ్ బ్రౌన్‌‌ను మాత్రం కాలి గాయం కారణంగా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ శ్మశానంలో 1924 వరకు దహన సంస్కారాలు నిర్వహించేవారు. 2021లో అక్కడి ప్రభుత్వం దీనిని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్‌లో చేర్చింది.

Next Story