- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
China: టారీఫ్ వార్ వేళ.. అమెరికాకు మరో షాక్ ఇచ్చిన చైనా

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(China)-చైనా (China) మధ్య టారీఫ్ వార్ జరుగుతోంది. అమెరికాపై చైనా దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ ఎగుమతులు నిలిపివేసిన డ్రాగన్.. ఇప్పుడు బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు స్వీకరించవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ కథనంలో వెల్లడించింది. అదే సమయంలో వైమానిక రంగంలో వినియోగించే విడిభాగాలను అమెరికా నుంచి కొనుగోళ్లు చేయవద్దని సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. కాగా.. ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
దారుణంగా మారిన బోయింగ్ పరిస్థితి
చైనా-అమెరికా టారీఫఅ వార్ తో బోయింగ్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్‌లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. ఒక్క 2018లోనే 25శాతం బోయింగ్ విమానాలను బీజింగ్ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు. ఇటీవలే అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ ప్రకటించిన బీజింగ్.. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది.