అమెరికా షాకింగ్ నిర్ణయం.. పలు భారతీయ కంపెనీలు, వ్యక్తుల వీసాలు రద్దు!

by Phanindra |

అమెరికా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పలు భారతీయ కంపెనీలు, వ్యక్తుల వీసాలు రద్దు చేసింది. ఫెంటనిల్ రవాణా చేస్తున్న ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా షాకింగ్ నిర్ణయం.. పలు భారతీయ కంపెనీలు, వ్యక్తుల వీసాలు రద్దు!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలకు, వారి కుటుంబాలకు వీసాలు ఇచ్చేందుకు యూఎస్ తిరస్కరించింది. ఇప్పటికే ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఈ విషయాన్ని న్యూఢిల్లోని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. వీరంతా యూఎస్‌కు ఫెంటనిల్ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ఫెంటనిల్ అనేది ఒక సింథటిక్ డ్రగ్. గతేడాది యూఎస్‌లో వేలాది మంది ఫెంటనిల్ ఉపయోగం వల్ల మరణించారు. దీంతో ఫెంటనిల్‌పై పోరాటం మొదలు పెడతామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో కొందరు భారత కార్పొరేట్లు, వారి కుటుంబాల వీసాలను రద్దు చేసినట్లు ఎంబసీ పేర్కొంది. అయితే సదరు కంపెనీలు, వ్యక్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. తాజా చర్యలతో ఈ కంపెనీలు, వ్యక్తులతోపాటు వారి కుటుం సభ్యులు కూడా యూఎస్ ప్రయాణానికి అనర్హులుగా మారతారని తెలిపింది. అలాగే యూఎస్‌కు ఫెంటనిల్ రవాణా చేసిన కంపెనీలతో సంబంధం ఉన్న ఎగ్జిక్యూటివ్స్‌ ఎవరైనా యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేస్తే వారిపై కఠినమైన దర్యాప్తు జరుగుతుందని స్పష్టంచేసింది.

Next Story